కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామం వద్ద పట్టణ సీఐ యువరాజ్ రోడ్డు భద్రత చర్యలు చేపట్టారు. సోమవారం ఒంటిమిద్ది గ్రామం వద్ద రోడ్డు కిరువైపులా పెరిగిన ముళ్లకంచెలను తొలగించి రోడ్డు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వేగ నియంత్రణకలు, సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్అండ్ బి శాఖకు లేఖ రాసినట్లు సీఐ తెలిపారు.