కళ్యాణదుర్గం పట్టణంలో రెండు కాలనీల్లో చోరీలు

81చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో పార్వతీనగర్, ముదిగల్లు బైపాస్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున దొంగతనాలు జరిగాయి. పార్వతీనగర్ లో అద్దెకు ఉంటున్న అనిల్, దీప దంపతుల ఇంటిలోని బీరువాలోని 4 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 1,60,000 నగదు పోయినట్లు వారు తెలిపారు. ముదిగల్లు బైపాస్ సమీపంలో శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిన 4 గొర్రెలు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు వివరించారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్