శెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ఇంట్లో బోయ చిట్టమ్మ అనే మహిళ అక్రమంగా కర్ణాటక మద్యం ప్యాకెట్లు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 110 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.