కళ్యాణదుర్గం మండల పరిధిలోని మండలాలలో సేవ్ ఆర్డిటి నినాదంతో భారీ బైక్ ర్యాలీ వైసీపీ శ్రేణులు నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆడిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ నిధులు పునరుద్ధరణపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పేదల అభివృద్ధి ఆగిపోతుందని విజ్ఞప్తి చేశారు. నిధులు పునరుద్ధరించకపోతే వైసిపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ రాజధానిలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.