కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో శనివారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు సమక్షంలో శెట్టూరు మండలం ములకలేడు సర్పంచ్ లక్ష్మీదేవి, భర్త నాగరాజు టిడిపి పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి పంచాయతీకి నిధులు మంజూరు చేయడమే కాకుండా అభివృద్ధి కూడా చేస్తోందన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్ని విధాలుగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.