కళ్యాణదుర్గం: రాష్ట్ర స్థాయి హాకీ జట్టుకు విద్యార్థుల ఎంపిక

69చూసినవారు
కళ్యాణదుర్గం: రాష్ట్ర స్థాయి హాకీ జట్టుకు విద్యార్థుల ఎంపిక
అనంతపురంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎంపికల్లో కళ్యాణదుర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అఖిల్ కుమార్, అమృత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏపీ స్కూల్ గేమ్స్ అండర్ 14 విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ జట్టుకు ఎంపికయ్యారు. వీరిద్దరూ కళ్యాణదుర్గం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. గురువారం రోజున పాఠశాల అధ్యాపక బృందం వీరిద్దరికీ అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్