కంబదూరు మండలం ఓబగానిపల్లిలో శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు చిత్రపటానికి లబ్ధిదారులు, టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. “తల్లికి వందనం” ప్రోగ్రామ్ కింద పిల్లల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.13 వేలు జమ చేయడాన్ని సుస్మరిస్తూ జై చంద్రబాబు, జై నారా లోకేశ్ నినాదాలు చేశారు. సూపర్ సిక్స్ హామీలలో మరో హామీ అమలైందని పార్టీ నేతలు పేర్కొన్నారు.