ఇన్ఫిన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుందుర్పీ మండలంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని, ఉపాధి కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కిషోర్, డైరెక్టర్ మహేష్ కుమార్, టిడిపి నాయకులు, ప్రజలు హాజరయ్యారు.