కళ్యాణదుర్గం: కార్మికుల హక్కులను కాలరాచే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ

55చూసినవారు
కళ్యాణదుర్గం: కార్మికుల హక్కులను కాలరాచే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ
సీఐటీయూ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలో భాగంగా బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయ ఇన్చార్జి ఏఓ ప్రవీణ్ కుమార్ కి లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక సమస్యలను పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్