కళ్యాణదుర్గం శివారులోని బళ్లారి రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కళ్యాణదుర్గం నుంచి ఇసుక లోడుతో బళ్లారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.