కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమన్వయ కమిటీ సభ్యులు లక్ష రూపాయల చెక్కును వరద బాధితుల కోసం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమన్వయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.