రేపు కళ్యాణదుర్గంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ

69చూసినవారు
రేపు కళ్యాణదుర్గంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ
కళ్యాణదుర్గంలో గురువారం టీడీపీ విజయోత్సవ బైక్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు క్యాంపు కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొననుండగా, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్