కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటు వచ్చిన వారికి ప్రథమ చికిత్స కొరకు ఇచ్చే స్టేమి ఇంజక్షన్ ను గురువారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు ఆక్సిజన్ తో పాటు తగిన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని, అలాగే సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఇక్కడ ఏ సౌకర్యాలు లేవో తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని వైద్యులకు ఎమ్మెల్యే తెలిపారు.