నార్పల మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు వడ్డెర సంఘం నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వడ్డే ఓబన్న స్వాతంత్ర్య పోరాటాలను గుర్తు చేశారు. సిపాయిలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డే సత్యనారాయణ, రామదాసు, వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.