అగలి మండలంలోని నరసంబుడి గ్రామంలో గురువారం రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను అందించారు. అగలి మండల వ్యవసాయ అధికారి శేఖర్ మాట్లాడుతూ మండలంలో అర్హులైన ప్రతి రైతుకు వేరుశనగ విత్తన కాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని రైతులు వేరుశనగ విత్తన కాయలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.