అగళి మండలం పీ బ్యాడగేర హనుమంతరాయప్పకు చెందిన వ్యవసాయ పొలంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి బోరుకు ఏర్పాటు చేసిన స్టార్టర్ కాలి బూడిదయ్యింది. రైతు అప్పులు చేసి బోరు వేయించుకుని పక్కన ఒక గుడిసె వేసుకుని అందులో స్టార్టర్ బిగించుకొన్నాడు. సర్క్యూట్ కావడంతో ఆ గుడిసెలో డ్రిప్ పరికరాలు పండించిన ఎర్రగడ్డల బస్తాలు పూర్తిగా కాలి పోయి లక్షల్లో నష్టం సంబవించిందని రైతు తెలిపారు.