అమరాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

71చూసినవారు
అమరాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అమరాపురం మండలం ఉదుగురు కాచికుంట గ్రామ మధ్యలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అధిక వేగంతో బైక్ అదుపుతప్పి కింద పడి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు.  మృతుడు మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం గుడ్డద హళ్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్