మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేయాలని ఏజీఎంను మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కలిసి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అనంతపురంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ వ్యాప్తంగా 80 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్య ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే టవర్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు.