మడకశిరలో ఆంధ్ర హిజ్రాలపై కర్ణాటక హిజ్రాలు దాడి చేశారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో వైబీ హళ్లికి చెందిన హిజ్రాలు రమ్య, దామినిలు బిక్షాటన చేస్తున్నారు. ఆ సమయంలో కర్ణాటక పావగడకు చెందిన ముగ్గురు హిజ్రాలు మడకశిర హిజ్రాలపై దాడికి దిగారని స్థానికులు అంటున్నారు. అడ్డుకున్న ప్రజలపై కూడా దాడికి ప్రయత్నించారని, విషయం తెలుసుకున్న సీఐ రాగిరి రామయ్య హిజ్రాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు.