కర్ణాటక రాష్ట్రం పావగడ పర్యటనలో భాగంగా గురువారం మడకశిరకు కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న వచ్చారు. ఆయనను స్థానిక ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాల గురించి, మడకశిరలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి కర్ణాటక మంత్రి రాజన్న స్వయంగా అడిగి తెలుసుకున్నారు.