తమ కుటుంబంపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని ఓ యువకుడు గొంతు కోసుకున్న ఘటన మడకశిరలో చోటు చేసుకుంది. ఏ తప్పూ చేయకుండానే పోలీసులు తమని వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు.. పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం నిరసనకు దిగాడు. అన్యాయంగా కేసు పెట్టారని, వెంటనే దాన్ని కొట్టివేయాలని డిమాండ్ చేశాడు. అనంతరం ఆగ్రహంతో ఊగిపోయి వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. అతన్ని నిలువరించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.