అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మడకశిర శిక్షణ డీఎస్పీ ఉదయ్ పావని, అర్బన్ సీఐ నాగేష్ బాబు అన్నారు. సోమవారం మడకశిర పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవలంబించాల్సిన పద్ధతులను ఈ సందర్భంగా తెలియజేసి ప్రమాదాల నివారణకు ఉపయోగించే పరికరాలను ప్రదర్శించారు