గుడిబండ, అమరాపురం పోలీస్ స్టేషన్లను శుక్రవారం జిల్లా ఎస్పీ వి. రత్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్, పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ నిర్వహణ రికార్డుల నిర్వహణపై పరిశీలించారు. రిసెప్సన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించి పోలీసు స్టేషన్లకు వచ్చే పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే ప్రతీ రికార్డు పక్కాగా ఉండేలా చూసుకోవాలన్నారు.