మడకశిర నియోజకవర్గ రైతులందరికీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేసి జేష్ట పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రైతులందరూ పంటలు వేయడం కోసం విత్తన శుద్ధి ఎరువులు సిద్ధం చేసుకుని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.