మడకశిర: భారత్ తిరంగా ర్యాలీలో ఎమ్మెస్ రాజు

64చూసినవారు
మడకశిర: భారత్ తిరంగా ర్యాలీలో ఎమ్మెస్ రాజు
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల దేశ త్రివిధ దళాలకు సంఘీభావంగా అనంతపురం పట్టణంలో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సైతం పాల్గొని భారత సైన్యానికి సంఘీభావంగా జాతీయ జెండా చేత పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీ అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీ నుండి సప్తగిరి సర్కిల్ వరకు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్