మడకశిర సీఐ నగేష్ బాబు శనివారం పోలీసులతో కలిసి మండలంలోని గొల్ల హట్టి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు పాత నేరస్థుల ఇళ్లకు వెళ్లి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మారణాయుధాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే మొహరం పండుగను గ్రామంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.