మడకశిర పట్టణం ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఏపీఐఐసీ భూములపై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మడకశిర మండలానికి సంబంధించి ఆర్ ఐ, వీఆర్వోలతో శుక్రవారం సమీక్షించారు. మడకశిరలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను సేకరించడం కోసం ఈ సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.