మడకశిర పట్టణంలో ఈ నెల 15వ తేదీన ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. ఈ సందర్బంగా 15వ తేదీన శనివారం ఉదయం 9: 00 నుండి సాయంత్రం 6: 00 గంటల వరకు మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.