మడకశిర నియోజకవర్గంలో త్వరలో ప్రారంభించబోయే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు హాజరవుతారని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు. బుధవారం మడకశిరలో ఆయన మాట్లాడుతూ.. నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, మరో మూడు సబ్ స్టేషన్ల నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగానే సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్, సవితతో పాటుగా జిల్లా ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు.