మడకశిర: కనుమ మారెమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే

68చూసినవారు
మడకశిర: కనుమ మారెమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే
మడకశిర పట్టణంలో భక్తిశ్రద్ధలతో, కన్నులపండుగగా నిర్వహిస్తున్న కనుమ మారెమ్మ జాతరలో మంగళవారం సాయంత్రం స్థానిక శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం. ఎస్. రాజు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామితో కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలకు తీర్థప్రసాదాలను అందించారు. జాతర నిర్వహాలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్