మడకశిర: సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

56చూసినవారు
మడకశిర: సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
మడకశిరలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో శుక్రవారం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతికోసం చేసిన కృషిని త్యాగాన్ని కొనియాడారు. మహిళలకు విద్యను అందించడానికి చేసిన కృషి నేటి ఉపాధ్యాయులకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్