మడకశిర శాసనసభ్యులు ఎం. ఎస్. రాజు గురువారం (రేపు ) ఉదయం 10. 00 గంటలకు మడకశిర పట్టణంలోని ఉపాధ్యాయ భవన్ లో సెప్టెంబరు 5వతేదీని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12. 00 గంటలకు మడకశిర పట్టణం, పావగడ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల యందు ఏర్పాటు చేసిన ఇంటర్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.