మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మనపల్లి గ్రామంలో శనివారం శ్రీ లక్ష్మీ నిడిమామిడి 38వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. భక్తులను ప్రజలను పలకరిస్తూ ఏర్పాట్లలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ భక్తులకు స్వయంగా ప్రసాదాలు పంపిణీ చేశారు