మడకశిర పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు బస్ కండక్టర్ సంజీవరాయప్ప కూతురు ఎస్ అంకిత పీహెచ్డీకి క్వాలిఫై అయింది. బుధవారం తండ్రి సంజీవరాయప్ప మాట్లాడుతూ ఇటవలె తన కూతురు సి ఎస్ ఐ ఆర్ సెట్ ఎగ్జామ్స్ లో మంచి ప్రతిభ కనబరచడంతో పీహెచ్డీకి అర్హత సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఒక సాధారణ ప్రైవేటు బస్సు కండక్టర్ కూతురు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడం సంతోషంగా ఉందని తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.