మడకశిర మండలం కల్లుమర్రి పంచాయతీ పరిధిలోని చెరువు కట్ట కింద రోడ్డు కిరువైపులా పెరిగిన కంపచెట్లను సర్పంచ్ నాగరాజు శుక్రవారం తొలగింప చేశారు. కంప చెట్లు దట్టంగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బంది ఏర్పడి ప్రమాదాలు జరుగుతుండడంతో తొలగించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ నరసన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.