మడకశిర పట్టణంలో మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న కవితా బాయి అనే బాలిక ఇంటర్మీడియట్ ఫలితాల్లో 982 మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైంది. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ చేతుల మీదుగా సోమవారం అవార్డు పొందింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ కవిత బాయిని ప్రత్యేకంగా అభినందించారు.