మడకశిర మండలం మేలవాయి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి నందుఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ కుమార్ ను ఆదివారం బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ తన బృందంతో కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పి ప్రమాదానికి కారణమైన వారిపైన వీలైనంత త్వరగా చర్యలు తీసుకునే విధంగా పోలీసు వారితో మాట్లాడుతామని తెలిపారు.