మడకశిర: అభివృద్ధి కోసమే పార్టీ మారాము

54చూసినవారు
మడకశిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వైకాపా కౌన్సిలర్లు తెలిపారు. శుక్రవారం మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా చైర్మన్ మమ్మల్ని పట్టించుకోలేదని ఎటువంటి అభివృద్ధికి సహకరించకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టి చైర్మన్ ని సైతం మారుస్తామని రాబోయే కాలంలో మడకశిర అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూడండి అని అన్నారు.

సంబంధిత పోస్ట్