మడకశిర నియోజకవర్గం లోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో గురువారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీలో, ప్రతి గ్రామంలో వీధి దీపాలతో పాటు ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. పంచాయితీ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.