మడకశిర మున్సిపల్ కమిషనర్ గా పగడాల జగన్నాథ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ రంగస్వామి బదిలీ కావడంతో జగన్నాథ్ ను మడకశిరకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ మాట్లాడుతూ అందరి సహకారంతో మడకశిర పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు.