అగళి మండలం హుల్లెకేరా దేవరపల్లి గ్రామంలో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడీ పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ ఉమేష్, సీడీపీఓ నాగమల్లేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 15 రోజుల పాటు ఈకార్యక్రమం నిర్వహించాలి. గర్భిణులు ప్రతి నెల బరువు పరిశీలించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.