విద్యుత్ సరఫరా లేక కాలనీవాసులు ఇబ్బందులు

51చూసినవారు
విద్యుత్ సరఫరా లేక కాలనీవాసులు ఇబ్బందులు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం మెలవాయి ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి విద్యుత్ సరఫరాలేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజుల నుండి ఎస్సీ కాలనీలోఇదే పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయంలో కరెంటు ఇవ్వకపోవడంతో అత్యవసరం బయటకు వెళ్లే సమయంలో ఎక్కడ చూసిన విషపురుగులు కనిపిస్తున్నాయి. చిన్నారులు మహిళలు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్