రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్లాపురి మహలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవంలో భాగంగా బుధవారం అమ్మవారిని అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు విశేష పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం నుండి నాలుగు రోజుల పాటు రత్నగిరి గ్రామంతో పాటు చుట్టూ పక్కల గ్రామస్తులు జ్యోతులు సమర్పించనున్నారు.