రొళ్ల మండలంలోని ఓ మహిళ మెడలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన రోషన్ అనే దుండగుడిని ఇదే మండలం ముత్తేపల్లి గ్రామం బస్టాప్ వద్ద సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వీరేష్ తెలిపారు. అతని నుండి 30 బంగారు బాల్స్ , లక్ష్మి బంగారు డాలర్స్, 10, 40 గ్రాముల బంగారం చైన్స్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం నిందితున్ని రిమాండ్ కు పంపించినట్లు చెప్పారు.