రోల్ల మండలంలోని జీ ఎన్ పాళ్యం గ్రామ పరిధిలోని వివాదాస్పద భూమిలో ఉన్న చింత చెట్లను గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు శనివారం నరికేశారు. యంత్రాల సహాయంతో చింత చెట్లను నరికి వేయడంతో గ్రామానికి చెందిన యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పచ్చని చింత చెట్లను నరికేసిన వారిపై ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.