మడకశిర నియోజకవర్గం రొల్ల మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉగ్రప్ప శుక్రవారం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఉగ్రప్ప భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉగ్రప్ప మరణం తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని గుండుమల అన్నారు.