రోళ్ల మండల కేంద్రంలో ఆదివారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతికి ప్రవేశాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రొల్ల మండల ఎంఈఓ శ్రీధర్ పరీక్షా కేంద్రానికి వెళ్లి పరిశీలించారు. ఈ పరీక్షకు మండల వ్యాప్తంగా 212 మంది దరఖాస్తు చేసుకోగా 196 మంది హాజరయ్యారని 16 మంది గైర్హాజరు అయ్యారని ఎంఈఓ తెలిపారు.