రొళ్ల మండలం ఏం రాయపురం పంచాయతీ బందిరేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్రప్ప అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సంతాపం వ్యక్తం చేశారు. బంధువులు, స్నేహితులు, పార్టీ నాయకులు మౌనం పాటించి పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.