రొళ్ల మండలం ఎంరాయపురం పంచాయతీ బంధ్రేపల్లి గ్రామానికి చెందిన ఉగ్రప్ప(61 )అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పీసీసీ అధ్యక్షులు రఘువిరారెడ్డి, స్థానిక రొళ్ల జడ్పీటీసీ అనంతరాజు వేర్వేరుగా స్వగ్రామం బంధ్రేపల్లి కి వెళ్లి భౌతిక కాయం పై పుష్ప గుచ్చాలు ఉంచి సంతాపంతో నివాళులు అర్పించారు. మృతుడు ప్రస్తుతం టీడీపీ నాయకుడిగా ఉంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో యువజనఅధ్యక్షులుగా పనిచేసారు.