ఉమ్మడి అనంతపురం జిల్లాకే ఆటోమొబైల్ రంగంలో ముఖ్యంగా నిలిచిన కియా మోటార్స్ యాజమాన్యం ఆహ్వానం మేరకు శుక్రవారం పెనుకొండ కియా ప్లాంట్ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ సందర్శించారు. జిల్లాలో కియా పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు కృషిని, పరిశ్రమ పురోగతిని కియా ప్రతినిధులు వివరించారు. రాబోయే రోజుల్లో స్థానిక యువతకు ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కియా యాజమాన్యాన్ని కోరారు.